శబ్దం మూవీ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న లైలా

ఎగిరేపావురమా, పెళ్లిచేసుకుందాం , ఉగాది , పవిత్రప్రేమ, ఖైదీగారు , నువ్వే కావాలి వంటి తెలుగు సినిమాలతో ప్రేక్షకులను అలరించిన లైలా..మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గత ఏడాది కార్తీ నటించిన సర్దార్ మూవీ తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన లైలా..ఆ సినిమా సూపర్ హిట్ కావడం తో మరింతగా సినిమాల ఫై ఫోకస్ చేస్తుంది. తాజాగా శబ్దం మూవీలో నటించింది.

ఆదిపినిశెట్టి హీరోగా అరివగజగన్ వెంకటాచలం డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కింది. డైరెక్టర్ అరివగజగన్ వెంకటాచలం ఆది పినిశెట్టి కలిసి వైశాలి సినిమాతో అలరించారు. మళ్లీ 14 ఏళ్ల తర్వాత ఈ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో లైలా పాత్ర అందరిని సర్ ప్రైజ్ చేస్తుందని ఈ మూవీ తర్వాత లైలా మళ్లీ వరుస సినిమాలతో బిజీ అవుతారని చిత్ర యూనిట్ అంటున్నారు. హారర్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్ లోనే లైలా లుక్స్ సినిమాపై ఒక ఇంప్యాక్ట్ క్రియేట్ చేశాయి. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తుండగా, 7జి ఫిలిమ్స్ ఆల్ఫా ఫ్రేమ్స్ కలిసి నిర్మిస్తున్నాయి.