ఇండియన్ 2 రిలీజ్ డేట్ ఫిక్స్..?

కమల్ హాసన్ – శంకర్ కలయికలో 1996 లో వచ్చిన భారతీయుడు చిత్రానికి సీక్వెల్ గా ఇండియన్ 2 (భారతీయుడు 2) తెరకెక్కుతుంది. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కావాల్సి ఉండగా..గతంలో సినిమా సెట్ లో అగ్ని ప్రమాదం జరగడం ,..ప్రాణ , ఆస్థి నష్టం జరగడం తో సినిమాకు బ్రేక్ పడింది. ఈ మధ్యనే షూటింగ్ రీ స్టార్ట్ అయ్యి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ వస్తుంది. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్ధ్ , ప్రియా , భవానీ, శంకర్, సముద్రఖని , బాబీ సింహా వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

కాగా ఈ చిత్రాన్ని ఈ ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నట్లు తెలుస్తుంది. నవంబర్ 9 లేదా 10వ తేదీన థియేటర్స్ లలో రిలీజ్ చేయనున్నారట. ఈ రెండు రోజుల్లో ఏదో ఒకరోజు కచ్చితంగా సినిమా విడుదల కాబోతున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈ చిత్రంలో ఆరు నుంచి ఏడుగురు విలన్లు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే పెద్ద పెద్ద నటులు భారతీయుడు 2లో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ రెడ్ జెయింట్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి అనిరుథ్ స్వరాలు అందించబోతున్నారు. అలాగే సినిమాటోగ్రఫీ బాధ్యతలు రవి వర్మన్ రత్నవేలు నిర్మిస్తుండగా… ఎడిటర్ గా ఎ శ్రీకర్ ప్రసాద్ పని చేయనున్నారు.