రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్..12 ప్రత్యేక రైళ్లు నడపనున్న దక్షిణ మధ్య రైల్వే

సమ్మర్ ను దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే..రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ తెలిపింది. సికింద్రాబాద్-దానాపూర్, సికింద్రాబాద్-దిబ్రూగఢ్ మధ్య 12 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. సికింద్రాబాద్ – దానాపూర్ (07419) రైలు మే 13, 20, 27 తేదీలలో నడవగా, దానాపూర్ – సికింద్రాబాద్ (07420) రైలు మే 15, 22, 29 తేదీలలో నడుస్తుందని సికింద్రాబాద్ రైల్వే అధికారులు తెలిపారు.

సికింద్రాబాద్-దిబ్రూగఢ్ (07046) రైలు మే 15, 22, 29 తేదీల్లో నడుస్తుండగా, దిబ్రూగఢ్-సికింద్రాబాద్ (07047) రైలు మే 18, 25, జూన్ 1 తేదీల్లో నడుస్తుంది. సికింద్రాబాద్-దానాపూర్-సికింద్రాబాద్.. ఈ ప్రత్యేక రైలు కాజీపేట, పెద్దపల్లి, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్‌నగర్, బల్హర్షా, నాగ్‌పూర్, ఇటార్సీ, పిపారియా, జబల్‌పూర్, కట్ని, సత్నా, మాణిక్‌పూర్, ప్రయాగ్‌రాజ్ ఛోకీ, పండిట్‌, దీనదయాళ్ ఉపాధ్యాయ, బక్సర్ మరియు అరా స్టేషన్లు లలో రెండు సైడ్లలలోనూ ఆగుతాయి.

సికింద్రాబాద్-దిబ్రూగఢ్-సికింద్రాబాద్ రైలు నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పలాస, బ్రహ్మాపూర్, ఖుర్దా రోడ్, భువనేశ్వర్, ఖుర్దా రోడ్, భువనేశ్వర్, చౌత్ భువనేశ్వర్, చట్త్ భువనేశ్వర్, చౌత్ భువనేశ్వర్, సత్తెనపల్లి, దంకుని, బర్ధమాన్, రాంపూర్ హాట్, మాల్దా టౌన్, కిషన్‌గంజ్, న్యూ జల్పాయిగురి, జపైగురి రోడ్, న్యూ కూచ్ బెహార్, న్యూ అలీపుర్‌దువార్, కోక్రాఝర్, న్యూ బొంగైగావ్, గోల్‌పారా, గౌహతి, జాగి రోడ్, హోజై, లుమ్‌డింగ్ Jn, ఫ్ఫుర్కటింగ్ JN, ఎఫ్‌ఫుర్‌కటింగ్ J మరైని, సిమలుగురి, నహర్కటియా, న్యూ టిన్సుకియా స్టేషన్లలలో రెండు వైపులా ఆగనుంది.