విజయ్ దేవరకొండ ‘ఖుషి ‘ నుండి రొమాంటిక్ సాంగ్ రిలీజ్

విజయ్ దేవరకొండ – సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఖుషి చిత్రం నుండి రొమాంటిక్ సాంగ్ రిలీజ్ అయ్యింది. ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ వంటి ప్రేమ కథల్ని తెరకెక్కించిన శివ నిర్వాణ ఈసారి ‘ఖుషి’ పేరుతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. వాస్తవానికి ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకోవాల్సి ఉండగా..మధ్యలో సమంత అనారోగ్యానికి గురి కావడం తో షూటింగ్ మధ్యలో ఆగిపోయింది. రీసెంట్ గా సమంత అనారోగ్యం నుండి బయటపడడంతో మళ్లీ షూటింగ్ మొదలుపెట్టుకుంది.

సెప్టెంబర్ 1 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో ఆదివారం సినిమాలోని ‘నా రోజా నువ్వే’ అంటూ సాగే పాట గ్లింప్స్ వీడియోను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. పూర్తి సాంగ్ ను విజయ్ బర్త్ డే సందర్భంగా ఈనెల 9న రిలీజ్ చేయనున్నారు. మైత్రి మూవీ మేకర్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

https://youtu.be/gpoR6jE6ATY