నటి ఖుష్బూ ఇంట విషాదం

చిత్రసీమలో వరుస విషాదాలు నమోదు అవుతూనే ఉన్నాయి. ఈ ఏడాది ఎంతో మంది అగ్ర నటి నటులను , దర్శక , నిర్మాతలను పోగొట్టుకుంది. తాజాగా నటి ఖుష్బూ ఇంట విషాదం నెలకొంది. ఖుష్బూ సోదరుడు అబూ బాకర్ అనారోగ్యం తో శనివారం కన్నుమూశారు. గత కొద్దీ రోజులుగా అనారోగ్యం తో బాధపడుతూ ఉండడం తో డాక్టర్స్ వెంటిలేటర్ ఫై చికిత్స అందిస్తున్నారు. ఈరోజు పరిస్థితి మరింత విషమించడం తో అయన కన్నుమూశారు. ఈ విషయాన్ని ఖుష్బూ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

మనం ఎంతో ప్రేమించే వ్యక్తులు మనతోనే ఉండాలని కోరుకుంటామని, కానీ అది జరగదని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తన సోదరుడి ప్రస్థానం ఇవాళ్టితో ముగిసిందని పేర్కొన్నారు. తన సోదరుడు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు కూడా ఖుష్బూ ఓ ట్వీట్ చేశారు. తన సోదరుడు చావుబతుకుల మధ్య ఉన్నాడని, అతడికి మీ ప్రార్థనలు అవసరం అంటూ అభిమానులను కోరారు. ఇక అబూ బాకర్ కొన్ని సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు.