పాకిస్థాన్‌ ప్రధానిగా షెహబాజ్‌!

ఇస్లామాబాద్ : ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్మాస తీర్మానంపై ఓటింగ్‌లో ఇమ్రాన్‌ఖాన్‌ ఓడిపోవడంతో పాకిస్థాన్‌కు కొత్త ప్రధాని ఎన్నిక ప్రక్రియ మొదలైంది. దీనికి సంబంధించి జాతీయ అసెంబ్లీ సోమవారం మరోసారి ప్రత్యేకంగా సమావేశం కానున్నది. ఎంపీలు కొత్త ప్రధానిని ఎన్నుకోనున్నారు. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పీఎంఎల్‌-ఎన్‌ పార్టీ నేత షెహబాజ్‌ షరీఫ్‌(మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ సోదరుడు) ఆదివారం నామినేషన్‌ వేశారు.

తాజా మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ పీటీఐ తరపున మాజీ విదేశాంగ మంత్రి మహ్మద్‌ ఖురేషీని అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఇద్దరి నామినేషన్లను జాతీయ అసెంబ్లీ సెక్రటేరియట్‌ ఆమోదించింది. శనివారం అర్ధరాత్రి జరిగిన ఓటింగ్‌ లో 174 ఓట్లతో విపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని నె గ్గించుకున్న నేపథ్యంలో షెహబాజ్‌ ఎన్నిక లాంఛనం కానున్నదని విశ్లేషకులు చెబుతున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/