కాగ్‌గా గిరీష్ చంద్ర‌ ముర్ము ప్రమాణం

కాగ్‌గా గిరీష్ చంద్ర‌ ముర్ము ప్రమాణం
Murmu-swearing-in-ceremony-as-CAG

న్యూఢిల్లీ: భారత  ‘కం‌ప్ర్టో‌లర్‌ అండ్‌ ఆడి‌టర్‌ జన‌ర‌ల్‌’(‌కా‌గ్‌)గా గిరీష్‌చంద్ర ముర్ము ప్రమాణస్వీకారం చేశారు. ఆయన చేత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ రాష్ట్రపతిభవన్‌లో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోడి సహా పలువురు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పూర్తి కోవిడ్19 నిబంధనలతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రస్తుత కాగ్ రాజీవ్ మెహెర్షి పదవీ విరమణ చేసిన నేపథ్యంలో ఆయన స్థానంలో ముర్ము బాధ్యతలు చేపట్టారు. కాగా జ‌మ్మూ క‌శ్మీర్ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ పద‌వికి ముర్ము రెండు రోజుల క్రితమే రాజీనామా చేసిన విషయం తెలిసిందే.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/