ప్రభాస్ ‘అన్ స్టాపబుల్ ‘ ప్రోమో కిరాక్ గా ఉంది

ప్రభాస్ ‘అన్ స్టాపబుల్ ‘ ప్రోమో కిరాక్ గా ఉంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజాగా బాలయ్య హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ 2 కు గెస్ట్ గా వచ్చిన సంగతి తెలిసిందే. ప్రభాస్ తో పాటు తన స్నేహితుడు గోపీచంద్ సైతం హాజరై సందడి చేసారు. దీనికి సంబదించిన ప్రోమోను ఆహా రిలీజ్ చేసింది.

రాజులు కావడంతో ప్రభాస్‌ని స్టేజ్‌పైకి బాలకృష్ణ ఆ రేంజ్‌లోనే గోత్రనామాలతో పిలుస్తూ ఆహ్వానించాడు. షోలోకి అతని ఎంట్రీనే అదిరిపోయింది. ఆ తర్వాత బాలకృష్ణ సభాముఖంగా అడుగుతున్నా.. అందరిలానే నన్ను కూడా డార్లింగ్ అనే పిలవాలని కోరారు. దానికి ప్రభాస్ హా.. సరే డార్లింగ్ సార్ అని పిలుస్తూ కనిపించాడు. ఆ తర్వాత నెమ్మదిగా పెళ్లి గురించి బాలయ్య ఆరాతీశాడు. మొన్న శర్వానంద్ వచ్చి.. నీ పెళ్లితో అతని పెళ్లిని లింక్ పెట్టాడు అని బాలయ్య చెప్పగా.. నేను సల్మాన్ ఖాన్ తర్వాత అనాలేమో? అని ప్రభాస్ నవ్వులు పూయించాడు.

నీ లైఫ్‌లో మోస్ట్ రొమాంటిక్ సీన్ ఏంటి? అని ప్రభాస్‌ని ప్రశ్నించగా.. మీకు అప్పట్లో ఏ ఇబ్బందులు లేవు.. ఇప్పుడు ఏమీ లేకపోయినా.. అనవసరమైన గోల ఎక్కువ అంటూ పరోక్షంగా సోషల్ మీడియా ట్రోల్స్ గురించి ప్రభాస్ ప్రస్తావించాడు. దానికి బాలయ్య.. మేము అప్పట్లో ఎన్ని సినిమాలు చేసేవాళ్లం తెలుసా? అనగా.. మరి ఆలోచించండి.. ఎన్ని న్యూస్‌లు వచ్చుంటాయో అనేశాడు. ఆ వెంటనే ఫోన్‌లో రాంచరణ్‌ని లైన్‌లోకి తీసుకున్న బాలయ్య.. అతని నుంచి ప్రభాస్ సీక్రెట్స్ తెలుసుకునే ప్రయత్నం చేశాడు. దాంతో.. ప్రభాస్.. ఓయ్ చరణూ.. రేయ్ నువ్వు నా ఫ్రెండా.. శత్రువా? అంటూ చెప్పొద్దని రిక్వెస్ట్ చేస్తూ కనిపించాడు.

గోపీచంద్ రాగానే ప్రభాస్ గురించి రాంచరణ్ ఇచ్చిన హింట్‌ని బాలయ్య చెప్పగానే.. రాణి గురించే కదా సార్? అని అడిగేశాడు. దాంతో ప్రభాస్ కింద పడి ఉన్న డార్ట్‌ని తీసుకుని గోపీచంద్‌పైకి విసరబోగా.. బాలయ్య అతడ్ని కాపాడేందుకు అడ్డుగా నిలబడ్డాడు. సార్ తప్పుకోండి సార్ అంటూ ప్రభాస్ నవ్వేశాడు. ఆ తర్వాత హీరోయిన్‌తో డేటింగ్ గురించి ప్రశ్నలు అడుగుతూ వచ్చిన బాలయ్య.. కృష్ణం రాజు టాపిక్ తీసుకొచ్చాడు. దాంతో ప్రభాస్ కూడా ఎమోషనల్ అయిపోయాడు. పెద్ద నాన్న గారు ఇంటికి శత్రువు వచ్చినా.. అతడ్ని గౌరవించి పంపించు. ఆ తర్వాత నీకు కోపం ఉంటే అతని ఇంటికి వెళ్లి చూసుకో లేదంటే బయటికి వెళ్లి చూసుకో అనేవారు అంటూ ప్రభాస్ గుర్తు చేసుకున్నాడు.

YouTube video