నేడు సత్తెనపల్లిలో పవన్ కళ్యాణ్ కౌలు రైతు భరోసా యాత్ర

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు సత్తెనపల్లిలో పవన్ కళ్యాణ్ కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టబోతున్నారు. ఇందుకు గాను శనివారం సాయంత్రమే విజయవాడ కు చేరుకున్నారు. గన్నవరం ఎయిర్ పోర్ట్ లో ఆయనకు అభిమానులు , పార్టీ కార్య కర్తలు ఘన స్వాగతం పలికారు. గత కొద్దీ నెలలుగా పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బులు ఖర్చు చేస్తూ ఆత్మ హత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు లక్ష రూపాయిల చొప్పున ఆర్ధిక సాయం అందజేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వందలమందికి సాయం చేసిన పవన్..నేడు పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్ర నిర్వహిస్తున్నారు.

ఉమ్మడి గుంటూరు జిల్లాలో 200 మందికి పైగా కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడినట్టు తెలుస్తోంది. వీరి కుటుంబాలకు సత్తెనపల్లి వేదికగా జరిగే కార్యక్రమంలో ఆర్థికసాయం చెక్కులు అందించనున్నారు. సత్తెనపల్లి మంత్రి అంబటి రాంబాబు సొంత నియోజకవర్గం అని తెలిసిందే. అయితే, ఈ నియోజకవర్గం నుంచి పలువురు నేతలు జనసేనలో చేరతారంటూ కథనాలు వస్తున్నాయి. ఈరోజు పవన్ సభలోనే ఈ చేరికలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది.