పేద కాపు మహిళల కోసం కాపునేస్తం పథకం..

ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు

kurasala kannababu
kurasala kannababu

కాకినాడ: కాపు మహిళల కోసం వైఎస్సార్‌ కాపు నేస్తం పథకం ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ధన్యవాదాలు తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన కాపులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. బుధవారం మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలో వచ్చిన ఏడు నెలల్లోనే రైతు భరోసా, నాడునేడు, నేతన్న హస్తం, ఆరోగ్యశ్రీ వంటి పథకాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని గుర్తుచేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా సీఎం వైఎస్‌ జగన్‌ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చూస్తున్నారని చెప్పారు. కానీ టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు ప్రతీ దానికి సైంధవుడిలా అడ్డుపడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు, టిడిపి నాయకులు అభివృద్ధి నిరోధకులుగా మారారని కన్నబాబు మండిపడ్డారు. శాసన మండలి రద్దు, అభివృద్ధి వికేంద్రీకరణను అడ్డుకుంటే బాబును ప్రజలు మరింత తిరస్కరిస్తారని చెప్పారు. అభివృద్దిని చంద్రబాబు ఎంత కాలం అడ్డుకుంటారో తాము చూస్తామని ఘాటుగా స్పందించారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/