ఏపీ పాఠశాలల్లో ఈ నెల 4వ తేదీ నుంచి ఒంటి పూట బడులు – మంత్రి ఆదిమూలపు

ప్రస్తుతం ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 10 దాటితే కాలు బయటపెట్టాలంటే భయం వేస్తుంది. రోజు రోజుకు ఎండ తీవ్రత పెరిగిపోతుంది. ఈ క్రమంలో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర పాఠశాల విద్యార్థులకు విద్యాశాఖ శుభవార్త తెలిపింది. ఈ నెల 4వ తేదీ నుంచి ఒంటి పూట బడులు ప్రారంభం కాబోతున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక ప్రకటన చేశారు. ఎండ తీవ్రత దృష్ట్యా సోమవారం నుంచి ఒంటి పూట బడులు నిర్వహిస్తామని వెల్లడించారు.

ఒంటి పూట బడుల నిర్వహణ నేపథ్యంలో ఉదయం 7.30 నుంచి 11.30 గంటల వరకు పాఠశాలల నిర్వహణ ఉంటుందని తెలిపారు. అలాగే ఏప్రిల్ 27వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటన చేశారు. మే 6 వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేశారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో చాలారోజులుగా ఒంటి పూట బడులు నిర్వహిస్తుంది.