ఒలంపిక్స్‌లో నీరజ్ చోప్రా కు బెర్తు కన్ఫామ్‌

Neeraj Chopra
Neeraj Chopra

పోర్చెఫ్‌ట్రూమ్‌: భారత జావెలిన్‌ స్టార్‌ నీరజ్ చోప్రా టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. అథ్లెటిక్స్‌ నార్త్‌ ఈస్ట్‌ మీటింగ్‌లో ఆయన ఏకంగా 87.63 మీటర్లు విసిరి ఈ ఏడాదిలో జరిగే ఒలింపిక్స్‌కు స్థానం సంపాదించాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ఒలింపిక్స్‌కు అర్హత సాధించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. తొలి మూడు త్రోలు 80 మీటర్లకు పైనే విసిరాను. దాంతో నాలుగో త్రోలో ఇంకా బలంగా వేయాలని నిర్ణయించుకున్నా అని నీరజ్‌ తెలిపాడు. అంతకు ముందు జకార్తాలో జరిగిన ఆసియా క్రీడల్లో అతడు 88.06 మీటర్లు విసిరి జాతీయ రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. అంతేకాదు ఈ క్రీడల్లో అతడు స్వర్ణం గెలిచాడు కూడా. అంతేకాకుండా కామన్‌వెల్త్‌ గేమ్స్‌లోనూ బంగారు పతకాన్ని సాధించాడు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana