చావో, రేవో వైఎస్‌ఆర్‌సిపిలోనేః గోరంట్ల మాధవ్

పార్టీలో తనకు సరైన గౌరవం ఉంటుందని ఆశాభావం

He will remain in ysrcp till his death says Gorantla Madhav

అమరావతిః ప్రాణం పోయేంత వరకు వైఎస్‌ఆర్‌సిపి లోనే ఉంటానని వైఎస్‌ఆర్‌సిపి ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. చావో, రేవో వైఎస్‌ఆర్‌సిపిలోనే… పార్టీ మారే ప్రసక్తే లేదని చెప్పారు. మళ్లీ టికెట్ కావాలని పార్టీ పెద్దలెవరిపై తాను ఒత్తిడి చేయలేదని తెలిపారు. తాడేపల్లిలో సజ్జల రామకృష్ణారెడ్డిని కలిశానని… అయితే, ఆయనతో తాను గొడవ పడినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పారు. త్వరలోనే సీఎం జగన్ ను కలుస్తానని అన్నారు.

అనేక కారణాలతో పార్టీలో మార్పులు చేశారని మాధవ్ చెప్పారు. హిందూపురం పార్లమెంట్ స్థానం నుంచి తనను తప్పించినా… పార్టీలో తనకు సరైన గౌరవం ఉంటుందనే భావిస్తున్నానని అన్నారు. టికెట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా తాను వైఎస్‌ఆర్‌సిపిలోనే ఉంటానని చెప్పారు.

హిందూపురం ఎంపీ నియోజకవర్గానికి బళ్లారి మాజీ ఎంపీ శాంతను జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఎంపీగా ఆమె పోటీ చేయబోతున్నారు. గోరంట్ల మాధవ్ కు ఏ స్థానాన్ని కేటాయిస్తారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. దీంతో పార్టీ అధిష్ఠానంతో ఆయన చర్చలు జరుపుతున్నారు.