కవిత ను కలిసేందుకు ఢిల్లీకి వెళ్లిన కేటీఆర్

లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన కవితను కలిసేందుకు కేటీఆర్, హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి ఢిల్లీకి బయల్దేరారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారు. వారితో పలువురు బీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారు. సాయంత్రం 6-7 గంటల మధ్య వీరు కవితతో భేటీ అవుతారు. ప్రస్తుతం ఆమె ఢిల్లీలోని ఈడీ సెంట్రల్ ఆఫీస్లో ఉన్నారు.

ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితను కలిసేందుకు సీబీఐ కోర్టు సమయం నిర్ధారించింది. ప్రతిరోజు సా.6 నుంచి సా. 7 గంటల వరకు కలిసేందుకు అవకాశం కల్పించింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టయిన ఆమెను ఈనెల 23 వరకు కస్టడీకి అనుమతిస్తూ కోర్టు నిన్న తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. కాగా కవిత అరెస్ట్పె ఆమె తండ్రి, మాజీ సీఎం కేసీఆర్ ఇప్పటివరకూ స్పందించలేదు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ నుంచి ఫామ్ హౌస్కు వెళ్లిపోయినట్లు సమాచారం.