ముగిసిన రాహుల్ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’

ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ముంబైలో ముగిసింది. ఈ సందర్భంగా సెంట్రల్ ముంబైలోని బీఆర్ అంబేడ్కర్ స్మృతి చిహ్నం వద్ద రాజ్యాంగ పీఠికను రాహుల్ చదివారు.

రేపు ఇండియా కూటమి ఆధ్వర్యంలో ముంబైలో భారీ బహిరంగ సభ జరగనుంది. కాగా 63 రోజుల పాటు 6700 కి.మీ మేర రాహుల్ యాత్ర చేపట్టారు. దేశంలోని 110 జిల్లాల్లో ఈ యాత్ర కొనసాగించారు.