రామగుండం బిఆర్ఎస్ నేతలకు వార్నింగ్ ఇచ్చిన మంత్రి కేటీఆర్

రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో పార్టీలలో టిక్కెట్ల ఇష్యూ బయటకు వస్తుంది. పలు నియోజకవర్గాలలో నేతల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. అధికార పార్టీ బిఆర్ఎస్ లో కూడా ఇలాంటి గొడవలే బయటపడుతుండడంతో పార్టీ కి నష్టం ఏర్పడుతుంది. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ దీనిపై దృష్టి సారించి , విభేదాలను తగ్గించేపనిలో పడ్డారు. తాజాగా రామగుండం నేతలను ఉద్దేశిస్తూ వార్నింగ్ ఇచ్చారు.

సిట్టింగ్ ఎమ్మెల్యేలు సహా పార్టీ నేతలు అందరూ సమానమేనని.. సర్వేల ఆధారంగానే టికెట్లు ఇస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. గోదావరిఖనిలో ప్రెస్‌మీట్ పెట్టి ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌పై విమర్శలు కురిపించిన బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో చర్చించారు. ఒక్కొక్కరిని అభ్యంతరాలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే చందర్ తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని.. కేసులు పెట్టి వేధిస్తున్నారని రామగుండం నేతలు కేటీఆర్‌కు తెలిపారు. ఏదైనా ఉంటే మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు చెప్పాలని కేటీఆర్ స్పష్టం చేశారు.