టెలిఫొటో కెమెరాతో పొట్రెయిట్‌ ఫొటోగ్రఫీకి కొత్త నిర్వచనం చెప్తున్న OPPO Reno10

launch of OPPO Reno10 in Hyderabad

హైదరాబాద్ : ప్రముఖ గ్లోబల్ స్మార్ట్ పరికరాల బ్రాండ్ OPPO, దాని Reno10 సేల్ జూలై 27న INR 32,999కి ప్రత్యక్ష ప్రసారం చేయబడిందని ప్రకటించింది.. OPPO ఈ-స్టోర్స్‌, ఫ్లిప్‌కార్ట్‌, ఇతర మెయిన్‌లైన్‌ రిటెయిల్‌ ఔట్‌లెట్స్‌లో అర్థరాత్రి 12 గంటల నుంచి ఈ హ్యాండ్‌సెట్‌ అందుబాటులో ఉంటుంది.

ఆల్ట్రా-స్లిమ్‌ 3D కర్వ్డ్‌ డిజైన్‌..

అల్ట్రా-స్లిమ్ బాడీ కలిగిన Reno10 5G ఐస్ బ్లూ, సిల్వరీ గ్రేలో లభిస్తుంది—3D కర్వ్డ్ డిజైన్‌ కలిగి ఎంతో తేలిగ్గా ఉండే ఈ ఫోన్‌ను పట్టుకోవడం సులభం. 120Hz 6.7-అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే, స్క్రీన్-టు-బాడీ 93% నిష్పత్తితో హద్దుల్లేని, మైమరిపింపజేసే అనుభూతిని అందిస్తుంది. డ్రాగన్‌ట్రైల్ స్టార్ 2 డిస్‌ప్లే, దృఢమైన పాలికార్బోనేట్ బ్యాక్‌ దీని సొంతం. దీని 2412×1080px స్క్రీన్ ప్రత్యక్ష సూర్యకాంతిలోనూ స్పష్టమైన, చక్కని విజువల్స్‌ను అందించడానికి 950నిట్స్‌ HDR ప్రకాశంతో ఒక బిలియన్ రంగులు కలిగి ఉంది. అంతే కాకుండా సరౌండ్ సౌండ్ అనుభూతి కోసం డిరాక్‌ పరీక్షించిన రియల్‌ ఒరిజినల్‌ టెక్నాలజీతో కూడిన డ్యూయల్ స్టీరియో స్పీకర్స్‌ మీరు అందుకుంటారు.

ఆల్ట్రా క్లియర్‌ పోట్రెయిట్స్‌ కోసం టెలిఫొటో కెమెరా..
శక్తిమంతమైన కెమెరా సిస్టమ్‌ కలిగిన Reno10 5Gలో 64MP OV64B అల్ట్రా-క్లియర్ మెయిన్‌ కెమెరా, 32MP IMX709 టెలిఫొటో పొట్రెయిట్‌ కెమెరా, 8MP IMX355 112° అల్ట్రా-వైడ్ కెమెరా, 32MP OV32C అల్ట్రా- కెమెరా ఉన్నాయి. ఈ సెటప్‌తో వినియోగదారులు తక్కువ-కాంతిలో పోట్రెయిట్స్‌ షూట్ చేస్తున్నప్పుడు లేదా వైడ్ యాంగిల్ షాట్స్‌ను కూడా అసాధారణమైన స్పష్టతతో క్యాప్చర్ చేయవచ్చు.

వేగవంతం, సురక్షితం & భద్రమైన ఛార్జింగ్‌ అనుభూతి..
దీని 5000mAh బ్యాటరీ Reno సిరీస్‌లో ఇప్పటి వరకు అతి పెద్దది -67W SUPERVOOCTM ఫోన్‌ను 47 నిమిషాల్లోనే 100% ఛార్జ్‌ చేస్తుంది. హడావుడిగా ఉండేవారు 30 నిమిషాల చార్జింగ్‌తో హ్యాండ్‌సెట్‌ను 70% వరకు నింపుకోవచ్చు.

ఇవే కాకుండా అవార్డు-గెల్చుకున్న OPPO బ్యాటరీ హెల్త్ ఇంజిన్ (BHE) ఛార్జింగ్ జీవితకాలం పెంచేందుకు రియల్‌-టైమ్‌ మానిటరింగ్‌ ద్వారా కరెంట్, వోల్టేజీని తెలివిగా నియంత్రిస్తుంది. నాలుగు సంవత్సరాల్లో 1,600 సార్లు ఛార్జింగ్‌ చేసిన తర్వాత కూడా హ్యాండ్‌సెట్ బ్యాటరీని 80% వరకు పదిలంగా ఉంచుతుంది.

దీర్ఘకాలం మన్నే చక్కని పనితీరు..
Reno10 5G మీడియాటెక్‌ డైమెన్సిటీ 7050 SoC, 8GB ర్యామ్‌, 256GB స్టోరేజ్‌పై పై నడుస్తుంది. OPPO ర్యామ్‌ విస్తరణ సాంకేతికత కలిగి ఉంటుంది కాబట్టి వినియోగదారులు ర్యామ్‌ను మరో 8GB వరకు పెంచుకునే వెసులుబాటు ఉంటుంది.

సమర్థవంతమైన కూలింగ్‌ కోసం వేడిని వెదజల్లేందుకు, అవాంతరం లేని ఉపయోగానికి అధిక-పనితీరు గల T19 బై-లేయర్‌ గ్రాఫైట్‌ను ఇది ఉపయోగిస్తుంది. గత తరంతో పోల్చితే OPPO డైనమిక్‌ కంప్యూటింగ్‌ ఇంజిన్‌ Reno10లో యాప్ ఓపెనింగ్ వేగాన్ని 12% పెంచుతుంది. అంతే కాకుండా, ఇది 48 నెలల ఫ్లూయన్సీతో వస్తుంది, అంటే ఈ పరికరం నాలుగు సంవత్సరాల తర్వాత కూడా కొత్త ఫోన్ వలె సాఫీగా పని చేస్తుంది.

స్మార్ట్‌ అనుభూతులు..
ఇన్‌ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్ యాప్‌ కలిగిన Reno10 5G ద్వారా మీరు ఏసీలు, సెట్-టాప్ బాక్సుల వంటి గృహోపకరణాలను రిమోట్‌ ద్వారా నియంత్రించవచ్చు. మల్టీ-స్క్రీన్ కనెక్ట్ ఫీచర్‌తో Reno10 5Gని పీసీ లేదా టాబ్లెట్ వంటి ఇతర పరికరాలకు కనెక్ట్ చేయవచ్చు, తద్వారా వినియోగదారులు మల్టీ స్క్రీన్స్‌తో ఏకకాలంలో పని చేసుకోవచ్చు. దీనిలోని స్మార్ట్ ఆల్వేస్-ఆన్ డిస్‌ప్లే వినియోగదారులకు స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ యాప్‌లలో అప్‌డేట్స్‌ చూసేందుకు ఫోన్‌ అన్‌లాక్ చేయకుండానే స్పాటిఫై మ్యూజిక్‌ను కంట్రోల్‌ చేసే వెసులుబాటు కల్పిస్తుంది, రెండేళ్ల వరకు OS అప్‌డేట్స్, మూడు సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌కు Reno10 5G సపోర్టు చేస్తుంది.

OPPO Reno10 5G మొదటి సేల్‌ సందర్భంగా కొనుగోలుదారులు ఈ ఆఫర్స్‌ పొందవచ్చు..

ఫ్లిప్‌కార్ట్‌, OPPO స్టోర్స్‌లో హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ కార్డుల ఉపయోగించడం ద్వారా కొనుగోలుదారులు తక్షణమే రూ.3000 డిస్కౌంట్‌ పొందవచ్చు. అంతే కాకుండా, ప్రముఖ బ్యాంకుల కార్డులు కలిగిన వారు 6 నెలల వ్యవధికి నో-కాస్ట్‌ ఈఎంఐ ఆప్షన్‌ పొందే సదుపాయం కూడా ఉంది. ఎస్‌బీఐ, కోటక్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్ బరోడా, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, వన్‌ కార్డ్, ఎయూ స్మాల్‌ ఫైనాన్స్‌ ద్వారా మెయిన్‌లైన్‌ రిటెయిల్‌ ఔట్‌లెట్స్‌ నుంచి 10% వరకు క్యాష్‌బ్యాక్‌, 6 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని కూడా కస్టమర్లు పొందవచ్చు. వినియోగరుణ భాగస్వాములు టీవీఎస్‌ క్రెడిట్‌, హెచ్‌డీబీ ఫైనాన్షియల్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్ ద్వారా కొనుగోలుదారులు రూ.3000 వరకు క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చు. అంతే కాకుండా, ప్రముఖ ఫైనాన్షియర్స్‌ నుంచి జీరో డౌన్‌ పేమెంట్‌ స్కీమ్స్‌ ప్రయోజనాన్ని అందుకోవచ్చు OPPO ఖాతాదారులు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో ఎక్స్‌ఛేంజ్‌ + లాయల్టీ బోనస్‌ను రూ.4000 వరకు అందుకోవచ్చు MyOPPO ద్వారా యూజర్స్‌ యూట్యూబ్‌, గూగుల్‌ వన్‌ ట్రయల్స్‌ను 3 నెలల వరకు ఉచితంగా పొందవచ్చు.

OPPO ప్రీమియం సర్వీస్‌ ఆఫర్‌..
సమస్యలు/సందేహాలు ఉంటే నిపుణులైన బృందం ద్వారా 24 గంటల్లోనే పరిష్కరించడం జరుగుతుంది (ప్రత్యేకమైన హాట్‌లైన్‌ – 9958808080) ఫిర్యాదు వచ్చిన 72 గంటల్లో సమస్యను పరిష్కరించేందుకు 13,000+ పిన్‌కోడ్స్‌లో ఫ్రీ పికప్‌, డ్రాప్‌ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. స్మార్ట్‌ఫోన్స్‌ సర్వీసు/రిపేర్స్‌ కోసం OPPO ససరమైన ఈఎంఐ అందిస్తోంది. వినియోగదారులు తమకు అనుకూలమైన ఈఎంఐ, వ్యవధిని ఎంచుకోవచ్చు.