బిజెపి-కాంగ్రెస్ పార్టీల నేతలకు మంత్రి కేటీఆర్ కౌంటర్

తెలంగాణ లో రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ..ఇప్పటి నుండే ఎన్నికల వేడి మొదలైంది. పార్టీ ల నేతలు ఒకరి ఫై ఒకరు ఘాటైన విమర్శలు , కామెంట్స్ చేసుకుంటూ వేడి పుట్టిస్తున్నారు. ఇక గత కొద్దీ రోజులుగా మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కేంద్ర సర్కార్ ఫై విమర్శలు చేస్తూ వస్తున్నారు. తాజాగా మరోసారి బిజెపి , కాంగ్రెస్ నేతల ఫై విమర్శలు చేసారు.

ఎన్‌పీఏ((పనికిరాని ఆస్తి- నాన్‌ పర్ఫార్మింగ్‌ అసెట్‌) గ‌వ‌ర్న‌మెంట్‌లో భార‌త‌దేశ ఎకాన‌మీని నాశ‌న‌మైంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. ద్రవ్యోల్బణం 30 ఏండ్ల గరిష్ఠానికి వెళ్లింది. ఎల్‌పీజీ సిలిండర్‌ ధర ప్రపంచంలోనే అత్యధికం. 45 ఏండ్ల‌లో అత్య‌ధికంగా నిరుద్యోగ రేటు పెంచార‌ని మండిప‌డ్డారు. అలాంటి వారు తెలంగాణ‌కు వ‌చ్చి మాకు నీతులు చెప్ప‌డం హాస్యాస్ప‌దంగా ఉంద‌న్నారు. అలాగే తెలంగాణ కు వ‌స్తున్న రాహుల్ గాంధీకి స్వాగ‌తం ప‌లుకుతున్నామ‌ని కేటీఆర్ తెలిపారు. రైతుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌పై స్ట‌డీ చేయాల‌ని సూచించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ ప‌థ‌కాలు అమ‌లు చేయాల‌ని కేటీఆర్ సూచించారు.