కెసిఆర్‌ నియంత పోకడలకు ఇది నిదర్శనం

కాంగ్రెస్ నేతలు.. గృహ నిర్బంధం చేస్తున్న పోలీసులు

uttam kumar reddy
uttam kumar reddy

హైదరాబాద్‌: కాంగ్రెస్ పార్టీ నేతలు ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా జలదీక్షకు సిద్దమైయ్యారు. అయితే కాంగ్రెస్ నేతలు దీక్షలు చేసేందుకు సిద్ధమవడంతో వారిని పోలీసులు ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేశారు. దీంతో తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి మండిపడ్డారు. పార్టీ నేతల అరెస్టును ఖండిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన కొనసాగుతోందని ధ్వజమెత్తారు. తమ నేతల ఇళ్ల ముందు ఉన్న పోలీసులు తక్షణం వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా తాము చేయాలనుకున్న కార్యక్రమాలను అడ్డుకోవద్దని కోరారు. మాట్లాడితే అరెస్ట్ చేస్తున్నారని, తెలంగాణను తెచ్చుకున్నది ఇందుకేనా? అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని ఓ నియంత పాలిస్తున్నారని ఉత్తమ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాగా, ఉత్తమ్‌ను కూడా పోలీసులు గృహ నిర్బంధం చేశారు. కాంగ్రెస్‌కే చెందిన మరో సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా నేతల గృహ నిర్బంధాలపై మండిపడ్డారు. కెసిఆర్ నియంత పోకడలకు ఇది నిదర్శనమన్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/