సర్కారు నుండి ‘మ..మ..మహేశా..’ సాంగ్ రాబోతుంది

సూపర్ స్టార్ మహేష్ బాబు – కీర్తి సురేష్ జంటగా గీత గోవిందం ఫేమ్ పరుశురాం డైరెక్షన్లో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మాణంలో తెరకెక్కుతున్న మూవీ సర్కారు వారి పాట. రీసెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. మే 12 న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో చిత్ర మేకర్స్ ప్రమోషన్ కార్య క్రమాలపై దృష్టి పెట్టారు. ఇప్పటికే విడుదలైన పలు సాంగ్స్ అదరగొట్టగా..ఇప్పుడు ‘మ..మ..మహేశా..’ అంటూ ఊర మాస్ సాంగ్ రాబోతుంది. 7న ఈ పాటను రిలీజ్​ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ఓ కొత్త పోస్టర్​ను కూడా మూవీ టీమ్​ విడుదల చేసింది. ఈ సీజన్​లోనే అత్యంత మాస్ సాంగ్ ‘మ..మ..మహేశ్’ అని క్యాప్షన్​ జోడించింది. ఇందులో మహేశ్, కీర్తి స్టెప్పులేస్తూ ఎంతో ఉత్సాహంగా కనిపించారు.

ఇక రేపు హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లో ప్రీ రిలీజ్ వేడుకను జరారాబోతున్నారు. ఇక ఈ సినిమాకు సంగీతం ఎస్ ఎస్ థమన్. నదియా, సముద్ర ఖని, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇక ఈ చిత్రాన్ని జీఏంబీ ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు.