కాంగ్రెస్ 6 గ్యారెంటీలపై కేటీఆర్ సెటైర్ ట్వీట్

KTR praises kcr

లోక్ సభ ఎన్నికలకు మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉన్న తరుణంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల ఫై సెటైర్లు వేస్తూ ట్వీట్ చేసారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆర్ గ్యారంటీలు గాలికొదిలేసారని… అందుకే ఈ 6 గ్యారంటీలను గుర్తించుకొని ఓటు వేయాలని కోరారు.

అందులో ఇన్వర్టర్, చార్జింగ్ బల్బ్స్, టార్చ్ లైట్లు, క్యాండిల్లు, జనరేటర్లు మరియు పవర్ బ్యాంకులను గుర్తుపెట్టుకుని… ఏ పార్టీకి ఓటు వేయాలో నిర్ణయం తీసుకోవాలని కోరారు . అయితే కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత నీళ్ల సమస్యలు అలాగే కరెంటు సమస్యలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ అంశాలను తెరపైకి తీసుకువచ్చేందుకు కేటీఆర్ ఇలా సెటైరికల్ ట్వీట్ చేసినట్లు ఉంది.