వైస్సార్సీపీ నేతల నేతృత్వంలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు..ముఖ్యఅతిథిగా వర్మ

తెలుగు ప్రజలందరి చేత అన్నగారు అనిపిలిపించుకున్న మహానేత, యుగపురుషుడు నందమూరి తారకరామారావు జయంతి ఈరోజు. ఈ సందర్బంగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు , ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు , ఎన్టీఆర్ అభిమానులు జయంతి వేడుకలు జరుపుకుంటున్నారు. ఇక టీడీపీ పార్టీ శ్రేణులు సైతం పెద్ద ఎత్తున జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలో వైస్సార్సీపీ నేతల నేతృత్వంలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు జరగబోతున్నాయి. ఎన్టీఆర్ విఙ్ఞాన ట్రస్ట్, దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శత జయంతి సభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ, పోసాని కృష్ణమురళి, అలీ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. అటు మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి, పలువురు ఇతర ప్రజాప్రతినిధులు హాజరుకాబోతున్నారు.