ఎన్నికల తరుణంలో జగ్గయ్యపేట భారీగా పట్టుబడ్డ నగదు

మరో మూడు రోజుల్లో ఏపీలో సార్వత్రిక ఎన్నికల జరగనున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నగదు పట్టుబడుతోంది. అనేక చోట్ల పోలీసుల తనిఖీల్లో నగదు పట్టుబడుతోంది.

తాజాగా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్‌పోస్టు వద్ద చేపట్టిన తనిఖీల్లో లారీలో తరలిస్తున్న రూ.8.40 కోట్లను సీజ్‌ చేశారు. నగదును హైదరాబాద్‌ నుంచి గుంటూరుకు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు.