ఇకపై కాంగ్రెస్ అవసరంలేదని గాంధీజీ ఆనాడే చెప్పారుః కెటిఆర్‌

పీసీసీ పోస్టును రూ.50 కోట్లకు అమ్ముకున్నరని ఆరోపణలు

minister-ktr

హైదరాబాద్‌ః కాంగ్రెస్ పార్టీలోనే అవినీతి జరుగుతోందని, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని అమ్ముకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని బిఆర్ఎస్ లీడర్, తెలంగాణ మంత్రి కెటిఆర్ విమర్శించారు. స్వయంగా ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ ఆరోపణలు చేశారని గుర్తుచేశారు. పీసీసీ చీఫ్ పోస్టును రూ.50 కోట్లకు అమ్ముకున్నారని ఆరోపించారని చెప్పారు. పార్టీలో పదవులు అమ్ముకోవడం, కొనుగోలు చేయడం ఏంటని ప్రశ్నించారు.

అలాంటి పార్టీకి చెందిన రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి అక్రమాల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని మంత్రి విమర్శించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక కాంగ్రెస్ పార్టీ అవసరం తీరిపోయిందని, ఇకపై కాంగ్రెస్ అవసరంలేదని గాంధీజీ ఆనాడే చెప్పారని గుర్తుచేశారు. బహుశా.. పార్టీలో ఇలాంటి వారు ఉంటారని గాంధీజీ ఊహించారేమో అని కెటిఆర్ ట్వీట్ చేశారు.