అల్లరి నరేష్ ‘ఉగ్రం’ ఫస్ట్ లుక్ రిలీజ్

గత కొంతకాలంగా సరైన హిట్స్ లేని అల్లరి నరేష్ కు నాంది చిత్రం సూపర్ హిట్ అయ్యి..నరేష్ సినీ కెరియర్ కు ఊపిరి పోసింది.విజ‌య్ క‌న‌క‌మేడ‌ల డైరెక్షన్లో గత ఏడాది ఫిబ్రవరి లో విడుదలైన ఈ మూవీ కమర్షియల్ గా మంచి విజయం సాధించి..నరేష్ లోని మరో కోణాన్ని బయటపెట్టింది. ఈ సినిమా హిట్ తర్వాత దీనికి సీక్వెల్ గా ఓ సినిమా రాబోతుందని ప్రకటించారు. ఇప్పుడు దానిని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సిద్ధం అవుతున్నారు.

విజ‌య్ క‌న‌క‌మేడ‌ల డైరెక్షన్లో నరేష్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ ఉగ్రం. క్రైమ్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో తెర‌కెక్క‌నున్నఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ ప‌తాకంపై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ధి నిర్మిస్తున్నారు. ఈరోజు ఈ మూవీ తాలూకా టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేసారు. ఈ ఫస్ట్ లుక్ లో నరేష్ వీపు భాగంలో క‌త్తి గుచ్చుకుని ఒంటి నిండా ర‌క్తంగా ఉగ్ర రూపంలో క‌నిపిస్తున్నాడు. కేవ‌లం పోస్ట‌ర్‌తోనే మేక‌ర్స్ ఈ సినిమాపై విప‌రీత‌మైన ఆస‌క్తిని క్రియేట్ చేశారు. త్వ‌ర‌లోనే మేక‌ర్స్‌ ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివ‌రాలను వెల్లడించనున్నట్లు తెలియజేసారు.