6,500కుపైగా పంట కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

తెలంగాణ మార్క్‌ఫెడ్‌ ఛైర్మెన్‌ మారెడ్డి శ్రీనివాస రెడ్డి

mareddy srinivasa reddy
mareddy srinivasa reddy

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరం పెద్ద ఎత్తున పంటసాగు జరిగిందని తెలంగాణ మార్క్‌ఫెడ్‌ చెర్మన్‌ మారెడ్డి శ్రీనివాస రెడ్డి అన్నారు. ఇంతటి విపత్కర పరిస్థితులలో కూడా తెలంగాణ రైతులకు మేలు చేయాలని సిఎం కెసిఆర్‌ తలచారని అందుకనుగూణంగా రైతుల పంటలకు నీరు అందించారని అన్నారు. సుమారు నలబైలక్షలకు పైగా ఎకరాలలో సాగు జరిగిందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల రాష్ట్రంలో పుష్కలంగా నీరు ఉందని, 24 గంటల నిరంతర విద్యుత్‌ సరాఫరా అవుతుందని, దేశంలో ఎక్కడా లేని విదంగా మన రాష్ట్రంలో గిట్టుబాటు ఇస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6500 ధాన్యం కొనుగొలు కేంద్రాలు ఏర్పాటు చేశారని చెప్పారు.

తాజా ఏపి వార్తల కోసం కిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/