రెండోసారి కరోనా బారినపడిన మంత్రి కేటీఆర్

KTR tests positive for Covid-19 

రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ రెండోసారి కరోనా బారిన పడ్డారు. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లుగా స్వయంగా ఆయనే ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. స్వల్ప కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్లుగా మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.

ప్రస్తుతం తాను హోం ఐసోలేషన్ లో ఉన్నానని వెల్లడించిన కేటీఆర్… ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. 2021, ఏప్రిల్ 23న మంత్రి కేటీఆర్ క‌రోనా బారిన ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. మ‌ళ్లీ తాజాగా ఆయ‌న మ‌రోసారి క‌రోనా బారిన ప‌డ్డారు. ఇప్పటికే కాలు నొప్పితో బాధపడుతున్న మంత్రి కరోనా బారినపడినట్లు వెల్లడించడంతో గులాబీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. పార్టీకి చెందిన ముఖ్యనేతలతో పాటు పలువురు ప్రముఖులు ట్విట్టర్‌ ద్వారా మంత్రి కేటీఆర్‌కి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని త్వరగా రికవరీ కావాలని కోరుతున్నారు.

దేశంలో కొన్ని రోజులుగా కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో 3,20,418 మందికి కోవిడ్ టెస్టులను నిర్వహించగా కొత్తగా 5,439 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 22,031 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 65,732 యాక్టివ్ కేసులు ఉన్నాయి.