‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ నుండి మరో ఫీల్ గుడ్ సాంగ్ రిలీజ్

సుధీర్ బాబు నటిస్తున్న ”ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” చిత్రం నుండి ఫీల్ గుడ్ సాంగ్ రిలీజ్ అయ్యింది. సుధీర్ బాబు, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్‌లో రాబోతోన్న మూడవ‌ చిత్రం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఈ చిత్రంలో సుధీర్ బాబు సరసన కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. బెంచ్ మార్క్ స్టూడియోస్ బ్యానర్ మీద గాజులపల్లె సుధీర్ బాబు సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని బి మహేంద్ర బాబు, కిరణ్ బల్లపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. సెప్టెంబర్ 16వ తేదీన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ క్రమంలో మేకర్స్ ప్రమోషన్ కార్య క్రమాలను స్పీడ్ చేసారు. ఇప్పటికే ఈ సినిమా తాలూకా స్టిల్స్ , వీడియోస్ ఆకట్టుకోగా..ఈరోజు మంగళవారం చిత్రంలోని ‘ఆ మెరుపేమిటో .. కనుపాపతో ఏమన్నదో’ అంటూ సాగే సాంగ్ ను రిలీజ్ చేసారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యాన్ని అందించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించాడు. తాను మనసుపడిన అమ్మాయిని తలచుకుంటూ .. ఆమె అనుభూతుల్లో హీరో తేలియాడే సందర్భంలోనిది ఈ పాట. మెలోడీనీ కొత్తగా ట్యూన్ చేసిన తీరు మరింత ఫీల్ ను తీసుకొచ్చిందనే చెప్పాలి.

YouTube video