ఉచిత కరెంట్‌పై అవగాహన లేమితో రేవంత్ పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు – కేటీఆర్

ఉచిత కరెంట్ ఫై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ లో అగ్గి రాజేస్తున్నాయి. కాంగ్రెస్ దూకుడు ను ఎలా తగ్గించాలా..అని ఎదురుచూస్తున్న సమయంలో బిఆర్ఎస్ కు రేవంత్ వ్యాఖ్యలు ఓ ఆయుధంలా అందాయి. దీంతో బిఆర్ఎస్ శ్రేణులు రెచ్చిపోతున్నారు. రేవంత్ వ్యాఖ్యలపై వారం రోజులుగా నిరసనలు తెలుపుతూ, ప్రజల్లోకి కాంగ్రెస్ వస్తే తెలంగాణ రాష్ట్రం మళ్లీ చీకటి అవుతుందని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వస్తున్నారు.

శనివారం మరోసారి రేవంత్ ఫై మంత్రి కిటియా ధ్వజమెత్తారు. వ్యవసాయం, ఉచిత కరెంట్‌పై అవగాహన లేమితో రేవంత్ రెడ్డి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. వ్యవసాయానికి కరెంటు సరఫరా అంశంపై 2004 నుంచి 2014 వరకు ఉన్న కరెంటు సరఫరా తీరు.. 2014 తర్వాత ఉన్న తీరుపై రైతులనే అడుగుతామని.. కాంగ్రెస్ కరెంట్ కావాలా..? సీఎం కేసీఆర్ ఇచ్చే కరెంట్ కావాలా..? అనే అంశంపై చర్చలకు రావాలని.. ప్రజలే తమ తీర్పును చెబుతారన్నారు.

కరెంటు విషయంలో కాంగ్రెస్‌ చేస్తున్న విష ప్రచారంపై కేటీఆర్‌ మండిపడ్డారు. ఐదు దశాబ్దాలు రైతులకు సాగునీరు, ఎరువులు ఇవ్వకుండా, ప్రాజెక్టులు నిర్మించకుండా తెలంగాణను కాంగ్రెస్‌ అధోగతి పట్టించిందని, ప్రస్తుతం కేసీఆర్‌ పాలనలో ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న సమయంలో కరెంటు విషయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నిస్సిగ్గుగా, నిర్లజ్జగా వ్యవహరిస్తున్నడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంట్ సరఫరా విషయంలో రేవంత్‌ చేస్తున్న వ్యాఖ్యలపై.. సీనియర్లు స్పందించకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి తన వాఖ్యలను వెనక్కి తీసుకుని రైతులకు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.