అలస్కాలో భారీ భూకంపం..

అమెరికాలోని అలాస్కా లో శనివారం రాత్రి ఈ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.4గా గుర్తించినట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే (యూఎస్ జీఎస్) వెల్లడించింది. భూకంపం 9.3 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమైనట్లు USGS తెలిపింది. అలస్కా ద్వీపం,అలూటియన్ దీవుల,కుక్ ఇన్ లెట్ ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయని అధికారులు తెలిపారు.

భూకంపంతో దక్షిణ అలస్కా, అలస్కా ఐలాండ్ ని సునామీ చుట్టుముట్టే ప్రమాదం ఉన్నదని పామర్‌లోని జాతీయ సునామీ హెచ్చరిక కేంద్రం తెలిపింది. ఉత్తర అమెరికాలోని ఇతర తీర ప్రాంతాలకు మరియు కెనడా తీర ప్రాంతాలపై సునామీ ప్రమాదం ఏ స్థాయిలో ఉంటుందో అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, అమెరికా, కెనడాలోని పసిఫిక్ తీరానికి సునామీ ముప్పు లేదని అమెరికా జియోలాజికల్ సర్వే పేర్కొంది. అలస్కా అగ్నిపర్వతం అబ్జర్వేటరీ కేంద్రం షిషల్డిన్ అగ్నిపర్వతం శనివారం లావా ఎగజిమ్మినట్టు గుర్తించిన తర్వాత ఈ హెచ్చరికలను చేసింది.