బండి సంజయ్ ఫై కేటీఆర్ సెటైర్లు

మంత్రి కేటీఆర్ మరోసారి బండి సంజయ్ ఫై సెటైర్లు వేశారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డు రావడంతో యావత్ తెలుగు ప్రజానీకం సంబరాలు చేసుకుంటుంది. ఫస్ట్ టైం దక్షిణాది చిత్రంలోని సాంగ్ కు ఆస్కార్ రావడం తో సినీ ప్రేక్షకులు , అభిమానులే కాదు రాజకీయ నేతలు కూడా స్పందిస్తూ అభినందనలు తెలుపుతున్నారు.

ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్‌కు తెలంగాణ డిజిట‌ల్ మీడియా డైరెక్ట‌ర్ కొణ‌తం దిలీప్ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సాంగ్‌ను రాసిన చంద్ర‌బోస్‌ కు కూడా ఆయ‌న కంగ్రాట్స్ చెప్పారు. అయితే ఆర్ఆర్ఆర్ మూవీ విడుద‌ల సంద‌ర్భంగా రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ చేసిన వ్యాఖ్య‌ల‌ను కొణ‌తం దిలీప్ గుర్తు చేశారు. ఆర్ఆర్ఆర్ చిత్రంపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన ఇలాంటి ద్వేషపూరిత వ్య‌క్తుల‌ను దూరంగా ఉంచుదాం అని పేర్కొన్నారు. ఈ ట్వీట్‌పై కేటీఆర్ స్పందించారు. నాటు నాటు పాట‌కు మోడీ వ‌ల్లే అవార్డు వ‌చ్చిందని ఇలాంటి మ‌తోన్మాద వ్య‌క్తులు చెప్పుకుంటారేమోన‌ని కేటీఆర్ పేర్కొన్నారు.