21 మందిని విద్యార్థులను వెనక్కు పంపించేసిన అమెరికా

అట్లాంటా, శాన్‌ఫ్రాన్‌సిస్కో, షికాగో ఎయిర్‌పోర్టుల్లో గురువారం వెలుగు చూసిన ఘటన

Telugu students among 21 students deported from US in a single day

న్యూఢిల్లీః పైచదువుల కోసం అమెరికాకు వెళ్లిన కొందరు భారతీయ విద్యార్థులకు అక్కడి ప్రభుత్వం ఊహించని షాకిచ్చింది. మొత్తం 21 మందిని ఎయిర్‌పోర్టు నుంచే రిటర్న్ ఫ్లైట్లలో వెనక్కు పంపించేసింది. వీరిలో అధికశాతం తెలుగు రాష్ట్రాల వారేనని తెలిసింది. గురువారం అట్లాంటా, శాన్ ఫ్రాన్సిస్కో, షికాగో ఎయిర్‌పోర్టులకు చేరుకున్న కొంత సేపటికీ విద్యార్థులను తనిఖీ చేశారు. ఈ క్రమంలో కొందరిపై అనుమానం రావడంతో వారి పత్రాలను లోతుగా పరిశీలించారు. విద్యార్థుల ఆర్థిక పరిస్థితులు, ఫోన్లు, మెయిళ్లు, కన్సల్టెన్సీలు, వారు ప్రవేశాలు పొందిన వర్సిటీల్లో ఫీజులకు సంబంధించిన వివరాలన్నీ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. చివరకు కొందరి వద్ద ఉన్న పత్రాల్లోని వివరాలు సక్రమంగా లేకపోవడంతో వారిని వెనక్కు పంపించేశారు. ఇలా తిరస్కరణకు గురైన వారు మళ్లీ అమెరికా వీసాకు దరఖాస్తు చేసుకునేందుకు అయిదేళ్ల దాకా అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు.