ప్రియమైన మోడీ గారు అంటూ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను ప్రస్తావించిన కేటీఆర్

మోడీ ప్రభుత్వంలో ఏదైనా పెరగడమే తప్ప తగ్గిందిలేదని ప్రతి ఒక్కరికి తెలుసు..పెట్రోల్ , గ్యాస్ , నిత్యావసర వస్తువులు ఇలా ఏదైనా సరే సామాన్యుడు బ్రతికే రోజులు లేకుండా పోయాయి ప్రతి ఒక్కరు విమర్శిస్తున్నారు. ఈ తరుణంలో బిఆర్ఎస్ మంత్రి కేటీఆర్ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను ప్రస్తావిస్తూ మోడీ ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు.

‘ ఉప్పు పిరం.. పప్పు పిరం.. పెట్రోల్‌ పిరం.. డీజిల్‌ పిరం.. గ్యాస్‌ పిరం.. గ్యాస్‌పై వేసిన దోశ పిరం.. అన్నీ పిరం.. పిరం.. జనం అంత గరం.. గరం’ అంటూ ట్వీట్‌ చేశారు. అందుకే ప్రియమైన ప్రధాని మోడీ కాదు.. పిరమైన ప్రధాని మోడీ అని అంటున్నా అంటూ మంత్రి సెటైర్‌ వేశారు.

ఇంధన ధరలు ఆకాశాన్ని తాకడానికి కారణమైన అదనపు ఎక్సైజ్‌ సుంకం, సెస్‌ను ఎత్తివేయాలని మంత్రి కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. అలాగే నిత్యవసర వస్తువుల ధరలు ఏవిధంగా పెరిగాయి? వాటితో సామాన్యులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని తెలుపుతూ పలు పత్రికల్లో వచ్చిన వార్త కథనాలకు సంబంధించిన క్లిప్పింగ్‌లను షేర్‌ చేశారు.