ఎమ్మెల్యే రఘునందన్ ఫై IPS అధికారుల సంఘం ఆగ్రహం

దుబ్బాక బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావుపై IPS అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. బిజెపి ఎంపీ బండి సంజయ్ అరెస్ట్ నేపథ్యంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ..బీహార్ రాజ్యాంగాన్ని డీజీపీ అంజనీకుమార్ అమలు చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై IPS అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర డీజీపీపై దారుణ పదజాలం ఉపయోగించారని, రఘనందన్ రావుపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ స్వీకర్ కు ఫిర్యాదు చేశారు. పోలీసుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా రఘునందన్ వ్యాఖ్యాలు ఉన్నాయని వారు వెల్లడించారు.

ఇక పేపర్ ఔట్ కేసులో కుట్ర దారుడిగా బండి సంజయ్‌ను పోలీసులు చేర్చారు. బండి సంజయ్ పై మొత్తం రెండు కేసులు నమోదు చేశారు. కమలాపూర్ , కరీంనగర్ 2టౌన్ లో సంజయ్ పై కేసులు నమోదు చేశారు. పేపర్ లీకేజి ప్రచారం వెనుక బండి సంజయ్ పాత్ర ఉందని.. ఇందులో భాగం 420, సెక్షన్ 6 ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్ కింద కేసు నమోదు చేశారు.