మరోసారి గోదావరి ఎక్స్‌ప్రెస్‌ రైలుకు తప్పిన ప్రమాదం

మరోసారి గోదావరి ఎక్స్‌ప్రెస్‌ రైలుకు తప్పిన పెను ప్రమాదం తప్పింది. బుధవారం (మార్చి 15) సాయంత్రం సికింద్రాబాద్ స్టేషన్ నుంచి విశాఖపట్నం వెళ్తుండగా.. మౌలాలి స్టేషన్ సమీపంలోకి రాగానే ఓ బోగీలో పొగలు రావడం తో ప్రయాణికులు భయంతో వణికిపోయారు. పెద్ద పెద్ద అరుపులు వేశారు. దీంతో రైలును అక్కడే నిలిపివేసి మరమ్మతు చర్యలు చేపట్టారు. అనంతరం రైలు తిరిగి బయల్దేరింది. ఈ ఘటన కారణంగా సాయంత్రం 6:10 నుంచి 6:25 గంటల వరకు గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలు మౌలాలి స్టేషన్‌లో నిల్చిపోయింది.

ఈ మధ్యనే గోదావరి ఎక్స్ ప్రెస్ కు పెను ప్రమాదం తప్పిన సంగతి తెలిసిందే. విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌ వస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌ రైలు (12727) మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలోని అంకుషాపూర్‌ వద్ద పట్టాలు తప్పింది. 6 బోగీల వరకు పట్టాల నుంచి పక్కకు జరిగాయి. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఏంజరగకపోవడం తో అంత ఊపిరి పీల్చుకున్నారు. LHB టెక్నాలజీతో కూడిన కోచ్‌ల కారణంగా నాటి ప్రమాదం నుంచి అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఇక ఈరోజు మరోసారి ప్రమాదానికి గురి కావడం తో గోదావరి ట్రైన్ అంటే ప్రయాణికులు భయపడుతున్నారు.