ఏపీలో కరోనా కేసులొచ్చిన పాఠశాలల మూసివేత

విద్యాశాఖ కీలక నిర్ణయం

school-closure-where-corona-cases-are-registered-ap-govt
schools-closure-where-corona-cases-are-registered-ap-govt

Amaravati: ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కేసులు పెరుగుతున్నకారణంగా విద్యాశాఖ కారణంగా కీలక ప్రకటన చేసింది.   ‌కరోనా కేసులు వచ్చిన పాఠశాలలను ,విద్యాసంస్థలు మూసేయాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఆదేశించారు. అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు.నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో తరగతులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రణాళికతో చర్యలు తీసుకోవడంతో విద్యా సంవత్సరాన్ని గాడిలో పెట్టినట్టు తెలిపారు. కొన్ని రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని, కేసులు పెద్ద సంఖ్యలో నమోదైన విద్యాసంస్థలను వెంటనే మూసివేయాలని ఆదేశించారు.

రాజమండ్రిలోని ప్రైవేటు కళాశాలలో 168 మందికి కరోనా సోకిందని , కరోనా సోకిన వారిని గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పాఠశాలలు, కళాశాలల్లో కరోనా నిబంధనలకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాలని, విద్యార్థులకు కరోనా పరీక్షల సంఖ్యను పెంచుతామని అన్నారు

తాజా ‘చెలి’ శీర్షికల కోసం : https://www.vaartha.com/specials/women/