ఏపీ టెన్త్ పరీక్షల ఫలితాలు విడుదల

ఏపీ పదో తరగతి పరీక్షల ఫలితాలను మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం విడుదల చేసారు. ఈ ఏడాది మొత్తం 72.26 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. గత ఏడాది కంటే ఈ సారి 5 శాతం ఉత్తీర్ణత శాతం పెరిగినట్లుగా మంత్రి వెల్లడించారు. ఈ ఏడాది కూడా బాలురు కంటే బాలికలదే పై చేయి సాధించినట్లుగా ఆయన తెలిపారు.

పరీక్షలకు హాజరైన మొత్తం విద్యార్థుల సంఖ్య 6,09, 081గా ఉంది.. స్పాట్ వ్యాల్యుయేషన్ ఏప్రియల్ 19 నుంచి 26వ తేదీ వరకు పూర్తి చేశాం.. 8 రోజుల్లో స్పాట్ వ్యాల్యుయేషన్ పూర్తి చేశామని.. రికార్డు స్థాయిలో త‌క్కువ‌ రోజుల్లోనే ఫ‌లితాల‌ను విడుద‌ల చేస్తున్నట్టు మంత్రి సత్యనారాయణ తెలిపారు. ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం 72.26గా ఉంది.. గత ఏడాది కంటే ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగింది. 87. 47 శాతం ఉత్తీర్ణతతో పార్వతి పురం మన్యం జిల్లా మొదటి స్థానంలో ఉండగా.. 60. 72 శాతంతో చివరి ప్లేస్ లో నంద్యాల జిల్లా ఉన్నది. 933 స్కూళ్లలో విద్యార్థులు 100 శాతం ఫలితాలు సాధించారు. 38 స్కూళ్లలో సున్నా ఫలితాలు వచ్చాయి. జూన్ 2 నుంచి సప్లమెంటరీ పరీక్షలు ఉంటాయని మంత్రి బొత్స సత్యనారయణ వెల్లడించారు.

సప్లమెంటరీ పరీక్షల కోసం ఈ నెల 17 వరకు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి బొత్స సత్యనారయణ తెలిపారు. ఫెయిలైన విద్యార్థులు క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. మే 13 వరకు రీకౌంటింగ్, రీ వెరిఫీకేషన్ కు అవకాశం కల్పించారు.