ప్రతిపక్ష పార్టీలఫై చురకలేసిన మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రతిపక్ష పార్టీలఫై మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీల నేతలు వచ్చే ఎన్నికల కోసం ప్రణాళికలు రచించి చాలా బిజీగా ఉన్నారని, కానీ మన దార్శనిక నాయకుడైన కేసీఆర్ దానికి మౌలిక సదుపాయాలను కల్పించడంలో బిజీగా ఉన్నారని కేటీఆర్ పేర్కొన్నారు. హెల్త్ కేర్, మెడికల్ ఎడ్యుకేషన్ రంగాలలో విప్లవాత్మక మార్పుకు నాంది పలికి తెలంగాణలోని 33 జిల్లాల లోనూ రంగానికి పెద్దపీట వేశారని సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు.

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల లో ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ప్రభుత్వ నర్సింగ్ కళాశాల 500 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.స్వతంత్ర భారతదేశంలో ఈ అపూర్వమైన ఘనత అని పేర్కొన్న ఆయన తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతి కి దగ్గరకు రాగల మరి ఏదైనా భారతీయ రాష్ట్రం ఉందా అంటూ ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు కొత్త శిఖరాన్ని తాకాయని పేర్కొన్నారు. 2014 నాటికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు 11 శాతం ఉండగా.. ‘భారత్‌ వెలిగిపోతున్న’ సమయంలో సెంట్రల్‌ గర్నమెంట్‌లో ఖాళీలు 12.1శాతానికి చేరాయంటూ సెటైరికల్‌ ట్వీట్‌ చేశారు. కేంద్రంలో ఖాళీలు 25శాతానికి చేరాయని విమర్శించారు. ఈ సందర్భంగా గణాంకాలతో ట్వీట్‌ చేశారు. హోంమంత్రిత్వశాఖలో 11.1శాతం, రైల్వేలో 20.5శాతం, డిఫెన్స్‌ సివిలియన్‌ 40.2శాతం, రెవెన్యూలో 41.6శాతంతో పాటు తదితర విభాగాల్లో ఖాళీలున్నాయని పేర్కొన్నారు.