మార్కెటింగ్ వ్యవస్థలో రిజర్వేషన్స్ తెచ్చిన ఘనత కేసీఆర్ దే

సిద్దిపేట : సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్ లో నూతన సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… మార్కెట్ వ్యవస్థ కేసీఆర్ వచ్చాక చాలా బలోపేతమైంద‌ని అన్నారు. మార్కెటింగ్ వ్యవస్థలో రిజర్వేషన్స్ తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్ దేన‌న్నారు. మహిళలు అన్ని రంగాల్లో అధ్బుతంగా రాణిస్తున్నారని, కావున ఈ మార్కెట్ కమిటీ మహిళకు కేటాయించారన్నారు.

సిద్దిపేటలో 1లక్ష 20వేల మెట్రిక్ టన్నుల సామర్ధ్యం కలిగిందన్నారు. గత ప్రభుత్వాలు గోడౌన్ల కోసం ఆలోచించిన దాఖలాలు లేవన్నారు. ప్రతి మండలంలో 5వేల మెట్రిక్ టన్నుల గోడౌన్ లు నిర్మించామ‌న్నారు. దేశానికి అన్నం పెట్టే ధాన్య గారంగా తెలంగాణ మారిందన్నారు. ఆంధ్ర కంటే రెట్టింపు వరి పంట తెలంగాణలో పండిందన్నారు. పంట పండడం వల్ల ధాన్యం మోయడానికి కూలీలు దొరకని పరిస్థితి తెలంగాణ వచ్చిందని, ఇతర రాష్ట్రాల నుండి కూలీలు వస్తున్నారన్నారు. ప్రమాణ స్వీకారోత్సవంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ రోజా శర్మ, ఎమ్మెల్సీలు పారుక్ హుస్సేన్, యాదవ రెడ్డి పాల్గొన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/