ఢిల్లీలో స్కూళ్లు, కాలేజీలు బంద్‌

న్యూఢిల్లీ: ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా ఉన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఢిల్లీతో పాటు స‌మీప న‌గ‌రాల్లో స్కూళ్లు, కాలేజీల‌ను బంద్ చేయాల‌ని ప్ర‌భుత్వం ఆదేశించింది. క‌మిష‌న్ ఫ‌ర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఈ ఆదేశాలు ఇచ్చింది. దీపావళి నుంచి ఢిల్లీ ప‌రిస‌ర ప్రాంతాల‌న్నీ వాయు కాలుష్యంతో ప్ర‌మాద‌క‌రరీతిలో ఉన్న విష‌యం తెలిసిందే. కోవిడ్ లాక్‌డౌన్ స‌మ‌యంలో ఆన్‌లైన్ విధానంలో ఎలా విద్యాసంస్థ‌లు ప‌నిచేశాయో అదే రీతిలో ప్ర‌స్తుతం స్కూళ్లు, కాలేజీలు న‌డ‌వ‌నున్నాయి.

సీఏక్యూఎం మొత్తం 9 పేజీల‌తో కూడిన ఆర్డ‌ర్‌ను రిలీజ్ చేసింది. ఎన్సీఆర్ ప్రాంతంలో ఉన్న ఢిల్లీ, హ‌ర్యానా, రాజ‌స్థాన్‌, యూపీ రాష్ట్రాలు క‌నీసం న‌వంబ‌ర్ 21వ తేదీ వ‌ర‌కు 50 శాతం ఉద్యోగులు ఇంటి నుంచి ప‌నిచేసే విధంగా ఆదేశించాల‌ని సీఏక్యూఎం కోరింది. ఎన్సీఆర్ రీజియ‌న్‌లోని ప్రైవేటు సంస్థ‌లు కూడా 50 శాతం వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్‌ను ఎంక‌రేజ్ చేయాల‌ని త‌న ఆదేశాల్లో సీఏక్యూఎం అభిప్రాయ‌ప‌డింది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/