కొత్తగూడ ఫ్లై ఓవర్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్ మహానగరంలో మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చింది. నగరంలో ట్రాఫిక్ కష్టాలను తగ్గించేందుకు ప్రభుత్వం పలు ఫ్లై ఓవర్లను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత ఎన్నో ఫ్లై ఓవర్లు అందుబాటులోకి రాగా..తాజాగా ఈరోజు కొత్త ఏడాది సందర్భాంగా మరో ఫ్లై ఓవర్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

ఆదివారం రోజున మంత్రి కేటీఆర్ కొత్తగూడ వద్ద ఫ్లై ఓవర్ ను ప్రారంభించారు. మూడు కిలోమీటర్ల ఈ ఫ్లై ఓవర్ ను రూ. 263 కోట్లతో నిర్మించారు. ఈ ఫ్లై ఓవర్ నిర్మాణంతో బొటానికల్ గార్డెన్, కొత్తగూడ, కొండాపూర్ జంక్షన్ లను కలిపేలా ఈ ఫ్లై ఓవర్ ను నిర్మించారు. గచ్చిబౌలి నుండి మియాపూర్ కు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి హైటెక్ సిటీకి ఈ ఫ్లై ఓవర్ ద్వారా సులభంగా చేరుకునే విధంగా వెసులుబాటు దక్కనుంది. మజీద్ బండ రోడ్డు నుండి బొటానికల్ గార్డెన్ జంక్షన్ వరకు 401 మీటర్ల ర్యాంపు, కొత్తగూడ జంక్షన్ నుంచి హైటెక్ సిటీ వైపు 383 మీటర్ల ర్యాంపు నిర్మించారు.