న్యూ ఇయర్ వేడుకల్లో బీర్ బాటిళ్లతో దాడి చేసుకున్న యువకులు

న్యూ ఇయర్ వేడుకల్లో కొంతమంది యువకులు బీర్ బాటిళ్లతో దాడి చేసుకున్న ఘటన సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. 2022 కు బై బై చెపుతూ..2023 కు గ్రాండ్ గా వెల్ కం చెప్పారు. ఇక న్యూ ఇయర్ వేడుకల్లో పలు ప్రమాదాలు జరుగగా..మద్యం మత్తులో కొన్ని చోట్ల దాడులు జరుపుకోవడం చేసుకున్నారు.

సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చాంపాపేట్‌లో నోవా ఫిష్టా న్యూయర్ వేడుకల్లో కొంతమంది యువకులు విధ్వసం సృష్టించారు. మద్యం మత్తులో ఒకరిపై ఒకరు బీర్ బాటిల్స్‌, కుర్చీలతో దాడి చేసుకున్నారు. ఈవెంట్ సెట్టింగ్‌ను కూల్చేయడంతో పాటు కుర్చీలను పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని యువకులను అక్కడి నుండి పంపించి వేశారు. పోలీసుల ఎంట్రీతో పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. ఘర్ణణ వాతావరణం నేపథ్యంలో న్యూ ఇయర్ ఈవెంట్‌ను ఆపేయాల్సిందిగా నిర్వాహకులకు పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో న్యూ ఇయర్ ఈవెంట్ అర్థాంతరంగా ఆగిపోవడంతో.. వేడుకకు హాజరైన వారందరూ వెనక్కి వెళ్లిపోయారు. న్యూ ఇయర్ వేడుకల్లో ఎంజాయ్ చేయాల్సిన తరుణంలో యువకుల వీరంగంతో వివాదంగా మారింది. ఈ ఘటన కు సంబంధించి కొంతమంది వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.