తన నానమ్మ ఊరిలో రూ. రెండున్నర కోట్ల సొంత ఖర్చుతో పాఠశాల నిర్మించిన కేటీఆర్‌

మంత్రి కేటీఆర్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. తన నానమ్మ ఫై ప్రేమతో.. రూ. రెండున్నర కోట్ల సొంత ఖర్చుతో పాఠశాల నిర్మించి వార్తల్లో నిలిచారు. కేటిఆర్ నాన్నమ్మ వెంక‌ట‌మ్మ సోంతూరు బీబీపేట మండ‌లం కోన‌పూర్. కాగా గ‌త ఏడాది మే 10 వ తేదీన కామారెడ్డి జిల్లా కోన‌పూర్‌లో ప‌ర్యటించారు కేటీఆర్. ఆ స‌మ‌యంలోనే త‌న సోంత డ‌బ్బులతో పాఠ‌శాల భవనానికి శంకుస్థాప‌న చేశారు. అప్పటి నుంచి రెగ్యూల‌ర్‌గా మానిట‌ర్ చేస్తూనే ఉన్నారు.

గ్రామ శివారులోని ఎకరం భూమిలో కేటీఆర్‌ రూ.2.40 కోట్లు వెచ్చించి ఈ సర్కారు పాఠ‌శాలని సర్వాంగ సుందరంగా నిర్మించారు. సకల వసతులతో కార్పొరేట్‌ బడి లా కనిపిస్తున్నది. బాల, బాలికల కోసం ప్రత్యేకంగా వేర్వేరుగా మరుగుదొడ్లు కట్టించారు. ప్ర తి తరగతి గదిలో ఫర్నిచర్‌ను సమకూర్చారు. కార్పొరేట్‌తరహా కుర్చీలు, బెంచీలను ఏర్పాటు చేస్తున్నారు. సమావేశాలకు ప్రత్యేకంగా మరో గదిని కూడా అందుబాటులోకి తీసుకువచ్చా రు. విద్యార్థుల ఉల్లాసం కోసం ప్రత్యేకంగా ఆటవస్తువులను ఏర్పాటు చేశారు.

దీంతో పాటుగా గ్రామంలో రూ. 10 కోట్లతో ప‌లు అభివృద్ది ప‌నులను సైతం ప్రారంభించారు. గ్రామానికి వెళ్లే దారిలో రూ.2.50 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేశారు..75 లక్షలతో సీసీ రోడ్లు వేశారు. అలాగే 25 ల‌క్షలతో గ్రామ పంచాయితీ నిర్మాణం చేప‌ట్టారు. మ‌రో 5 కోట్లను ప్రత్యేక నిధి కింద గ్రామానికి మంజారు చేశారు.. వీటితో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించారు. ఇళ్ల వరకూ రోడ్లు వేశారు. గ్రామంలో కుల సంఘాల భవనాలు, పలు ఆలయాల నిర్మాణాలు కూడా చేపట్టారు. ప్రస్తుతం కేటీఆర్ చేసిన అభివృద్ధి , పాఠశాల నిర్మాణం గురించి రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారు. త్వర‌లోనే కోన‌పూర్‌కు వ‌చ్చి నిర్మాణాలను ప్రారంభించనున్నట్లు కేటీఆర్ తన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. దీంతో గ్రామ‌స్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.