నేడు ప్రకాశం జిల్లాలో జగన్ బస్సు యాత్ర

సీఎం జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ యాత్ర ఈరోజు నెల్లూరు జిల్లా నుంచి ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించింది . పెద్దఅలవలపాడు, కనిగిరి మీదుగా పెద్ద అరికట్లకు వెళ్లనున్నారు. సాయంత్రం కొనకనమెట్ల క్రాస్ దగ్గర బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం బత్తువారిపల్లి, పొదిలి, రాజంపల్లి మీదుగా వెంకటాచలంపల్లికి వెళ్లి రాత్రి అక్కడే బస చేస్తారు.

30 ఏళ్ల క్రితమే సీఎంగా చేసిన చంద్రబాబు.. నా గతాన్ని చూసి ఓటేయండి అని అడగలేరు. మేనిఫెస్టోలోని 10 శాతం హామీలైనా అమలు చేశానని చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా? అంటూ సీఎం వైయ‌స్‌ జగన్‌ ప్రశ్నించారు. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా 9వ రోజు శనివారం సాయంత్రం నెల్లూరు జిల్లా కావలి నిర్వహించిన బహిరంగ సభలో వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌సంగించారు.

మంచి చేసిన మనందరి ప్రభుత్వానికి , ఆ మంచి అందుకున్న కోట్ల ప్రజానీకం అడుగడుగునా నీరాజనం పడుతోంది. అవతలి పక్షంలో తోడేళ్లుగా, మోసగాళ్లుగా ఉంటున్న వాళ్లంతా కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారు. వారి కుట్రలకు మనందరి జైత్రయాత్ర వారందరికి వ్యతిరేకంగా సిద్ధం సిద్ధం అంటూ లక్షల సింహాలు గర్జిస్తుంటే..వస్తున్న ఆ శబ్ధం సిద్ధం సిద్ధం..

వచ్చే ఐదేళ్లలో మన రాష్ట్ర భవిష్యత్‌ను, మన పేదల ఇంటింటి భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలకు కేవలం ఐదు వారాలు మాత్రమే గడువు ఉంది. ఈ ఎన్నికలుకేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేవి కావు..ఈ ఎన్నికలకు జగన్‌కు, చంద్రబాబుకు మద్య యుద్ధం కాదు..ఈ ఎన్నికలకు ప్రజలను మోసం చేయడమే అలవాటు పెట్టుకున్న చంద్రబాబుకు, ప్రజలకు మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయి అని జగన్ అన్నారు.