గంగవ్వ తో కలిసి నాటుకోడి కూర వండిన మంత్రి కేటీఆర్

ఓ పక్క ఎన్నికల ప్రచారంలో బిజీ గా ఉంటూనే మరోపక్క సోషల్ మీడియా లోను యాక్టివ్ గా ఉన్నారు మంత్రి కేటీఆర్. మొదటి నుండి సోషల్ మీడియా లో కేటీఆర్ యాక్టివ్ గా ఉంటూ వస్తున్న సంగతి తెలిసిందే. ఎవరు ఎలాంటి ఆపదలో ఉన్న వారికీ సాయం అందిస్తూ ఉండే రామన్న..తాజాగా యూట్యూబ్ ఫేమస్ గంగవ్వ తో కలిసి నాటుకోడి కూర వండి వార్తల్లో నిలిచారు. దీనికి సంబదించిన వీడియోస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

తెలుగు రాష్ట్రాల్లో మై విలేజ్‌ షో యూ ట్యూబ్‌ కి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పల్లెటూరి రుచులను, అనుబంధాల మీద వీడియోలు చేసి ఎంటర్‌టైన్‌ చేస్తుంటారు. చిన్న చిన్న వీడియోలతో ఈ ఛానెల్‌ ప్రారంభం అయ్యింది. ప్రస్తుతం సినిమా హీరోలతో ప్రమోషన్‌ వీడియోలు చేసే రేంజ్‌ కు ఎదిగింది. ఇందులో గంగవ్వ బాగా ఫేమస్‌ కాగా, అనిల్‌, అంజిమామ కూడా పలు సినిమాల్లో నటిస్తున్నారు. తెలంగాణలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మై విలేజ్‌ షో యూట్యూబ్‌ ఛానెల్‌ టీంతో మంత్రి కేటీఆర్‌ సందడి చేశారు. టీంతో కలిసి కేటీఆర్‌ నాటుకోడి కూర, బగారా రైస్‌ వండి సరదగా గడిపారు. ఈ కార్యక్రమంలోనే తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి గురించి కూడా ప్రస్తావించారు.

https://youtube.com/watch?v=xMTy77RJW8A%3Fsi%3D3tdyMm0Y9EHuV_4F