నేడు ఖమ్మం, కొత్తగూడెంలో సీఎం కేసీఆర్‌ సభలు

ఎన్నికల ప్రచారంలో భాగంగా గులాబీ బాస్ ఈరోజు ఖమ్మం, కొత్తగూడెంలో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. ఇప్పటికే పాలేరు, సత్తుపల్లి, ఇల్లెందు నియోజకవర్గాల్లో నిర్వహించిన సభలకు హాజరైన సీఎం కేసీఆర్‌ మూడోసారి ఖమ్మం, కొత్తగూడెంలో జరుగనున్న ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు.

మధ్యాహ్నం ఒంటిగంటకు కొత్తగూడెం జిల్లా కేంద్రానికి చేరుకుని ప్రకాశం స్టేడియంలో అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావును గెలిపించాలని కోరుతూ మాట్లాడనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఖమ్మం ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్‌ కళాశాల ప్రాంగణంలో శాసనసభ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్‌ గెలుపును కాంక్షిస్తూ ప్రసంగించనున్నారు.