భద్రాద్రి రామయ్య కల్యాణానికి కరోనా సెగ

భక్తులు లేకుండానే కల్యాణం..కల్యాణానికి ఎవరూ రాకండి: మంత్రి అజయ్

Sri Seeta Rama Kalyanam - Bhadrachalam
Sri Seeta Rama Kalyanam – Bhadrachalam

భద్రాచలం: కరోనా ప్రభావం భద్రాది రామయ్య కల్యాణంపై కూడా పడింది. భద్రాచలంలో ప్రతి ఏడాది జరుపుకునే భద్రాద్రి సీతారాముల కల్యాణానికి దేశ వ్యాప్తంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతుంటారు. ముందుగానే కల్యాణం టికెట్లు బుకింగ్ జరుగుతుంటుంది. రామయ్య కల్యాణాన్ని ఎన్నో ఏళ్లుగా ఆరుబయట.. ప్రతి ఒక్కరూ తిలకించేలా నిర్వహిస్తున్నారు. కానీ ఈసారి రామయ్య కల్యాణాన్ని తిలకించే అదృష్టం భక్తులకు దక్కదు. కారణం కరోనా మహమ్మారి. ఇది రాష్ట్రంలో రోజు రోజుకూ ఎక్కువవుతున్న కారణంగా స్వామివారి కల్యాణానికి ఎవరినీ అనుమతించట్లేదని.. కాబట్టి భక్తులెవరూ రావొద్దని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. కేవలం అర్చకులు మాత్రమే శాస్ర్తోక్తంగా కల్యాణ క్రతువును నిర్వహించనున్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/