కాంగ్రెస్ అద్భుత పాలనతో విద్యుత్ కోతలు – కేటీఆర్

బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్ రాష్ట్రంలో విద్యుత్ కోతలఫై ట్విట్టర్ వేదికగా స్పందించారు. రాష్ట్రంలో దశాబ్దం తర్వాత ఇన్వర్టర్లు, జనరేటర్లకు డిమాండ్ పెరుగుతుందని తాను అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో మూడు గంటలకు మంచి విద్యుత్ కోతల కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వారిపై ప్రభావం చూపుతుందని ఎబి షణ్ముక చేసిన ట్వీట్‌పై కెటిఆర్ స్పందించారు. కాంగ్రెస్ అద్భుత పాలనలో వేసవి ప్రారంభానికి రెండు నెలల ముందే విద్యుత్ కోతలు వచ్చాయంటూ కెటిఆర్ సెటైర్లు వేశారు.

వాస్తవానికి రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గరి నుండి 24 గంటల కరెంట్ అందిస్తూ వచ్చింది. కానీ కాంగ్రెస్ ఏర్పడి రెండు నెలలు కాలేదు..అప్పుడే గ్రామాల్లో , పట్టణాల్లో కరెంట్ కటింగ్ లు మొదలయ్యాయి. హైదరాబాద్ లో పలు కారణాలతో రెండు గంటల కటింగ్ చేస్తుండగా..గ్రామాల్లో సైతం కరెంట్ కటింగ్ అవుతుంది. ఇప్పుడే ఇలా ఉంటె వేసవి లో మళ్లీ ఉక్కపోత తప్పవా అన్నట్లు ప్రజలు మాట్లాడుకుంటున్నారు.