నేపాల్ మాయాదేవి ఆలయంలో మోడీ ప్రార్థనలు

ప్ర‌ధాని మోడీకి స్వాగ‌తం ప‌లికిన నేపాల్ ప్ర‌ధాని

PM Modi Prays At The MayaDevi Temple, Lumbini, Nepal l PMO

ఖాట్మండు: ప్ర‌ధాని నరేంద్ర మోడీ నేపాల్ చేరుకున్నారు. ఈసందర్బంగా ప్ర‌ధాని మోడీకి నేపాల్ ప్ర‌ధాని, ఆయ‌న భార్య‌, ప‌లువురు మంత్రులు ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు. ఆ త‌ర్వాత మోడీ బుద్ధ పౌర్ణ‌మిని పుర‌స్క‌రించుకొని అక్క‌డి మాయా దేవి ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఆల‌యం పక్క‌నే వున్న స్తంభం దగ్గ‌ర ప్ర‌ధానులిద్దరూ దీపాలు వెలిగించారు. ఆ త‌ర్వాత బోధి వృక్షానికి నీళ్లు పోశారు. ఆ త‌ర్వాత బౌద్ధ సంస్కృతి, వార‌సత్వ కేంద్రం నిర్మాణానికి శంకుస్థాప‌న చేశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/