భారత్ కు 3500 కోట్ల రుణం..వ‌ర‌ల్డ్‌బ్యాంక్‌

వాషింగ్ట‌న్‌: భారత్ లోని మ‌ధ్య‌, చిన్న త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల అభివృద్ధి కోసం ప్ర‌పంచ బ్యాంకు భారీ రుణ స‌హాయాన్ని ప్ర‌క‌టించింది. సుమారు 3500 కోట్ల రుణం ఇచ్చేందుకు వ‌ర‌ల్డ్ బ్యాంక్ ఆమోదం తెలిపింది. ఎంఎస్ఎంఈల ప‌నితీరును మెరుగుప‌రిచేందుకు ఆ రుణాన్ని వినియోగించ‌నున్నారు. క‌రోనా వ‌ల్ల తీవ్ర ప్ర‌భావానికి లోనైన‌ ఎంఎస్ఎంఈ రంగాన్ని బ‌లోపేతం చేసేందుకు వ‌ర‌ల్డ్ బ్యాంక్ ఈ రుణ స‌హాయాన్ని అందిస్తోంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/